
ట్యాగ్ · 7 కథనాలు


'సార్' టీజర్ రిలీజ్

'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ రిలీజ్..!

"జేమ్స్ "మూవీ తెలుగు టీజర్ రిలీజ్

'సెబాస్టియన్ పీసీ 524' టీజర్ రిలీజ్

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ రిలీజ్

గాడ్ ఫాదర్ టీజర్ కు మాసివ్ రెస్పాన్స్
మొత్తానికి మెగాఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన టైమ్ వచ్చేసింది. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సందర్భంగా చిరు బర్త్ డే కానుకగా ఫ్యాన్స్ కు టీజర్ తో ఒకరోజు ట్రీట్ ఇవ్వనున్నట్టు ప్రకటించిన చిత్రయూనిట్.. దీనిలో భాగంగానే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 20 ఏళ్లు ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు, కానీ సడన్‌గా తిరిగి వచ్చిన ఆరేడేళ్లలోనే జనాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు అంటూ మురళీ శర్మ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైంది టీజర్. ఇక్కడికి ఎవరు వచ్చినా పట్టించుకోను కానీ అతను మాత్రం రాకూడదు అంటూ నయనతార చెబుతున్న డైలాగ్…

'సార్' టీజర్ రిలీజ్
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా సార్. ఇప్పటివరకూ డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను అలరింటిన ధనుష్ ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో వస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మొదటినుండీ మంచి బజ్ క్రియేట్ అయింది. ఈసినిమాలో ధనుష్ స్కూల్ టీచర్‌గా నటించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉంది. అంతేకాదు.. ఈసినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్టు తెలుస్తుంది.

'థాంక్యూ' టీజర్ పై రానా.. ఆల్రెడీ సరైపోయావు బ్రదర్..!
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రావడంతో రిలీజ్ డేట్ కూడా లేట్ అయింది ఫైనల్ గా జూలై 8న విడుదల అవుతోంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఇక ఈసినిమా టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈటీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. నాగ చైతన్య.. క్లాస్, మాస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికొచ్చా అంటూ చై చెప్పిన హైలెట్ గా…

'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ రిలీజ్..!
ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రతి ఒక్క హీరో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఆ లిస్ట్ లో మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నాడు. అయితే రవితేజ మాత్రం కేవలం సినిమాల షూటింగ్ లలో మాత్రమే కాదు రిలీజ్ చేసే విషయంలో కూడా స్పీడుమీదున్నాడు. రీసెంట్ గానే ఖిలాడి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు పలు సినిమాలు లిస్ట్ లో ఉండగా.. అందులో రామారావు ఆన్ డ్యూటీ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

"జేమ్స్ "మూవీ తెలుగు టీజర్ రిలీజ్
కిషోర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చేతన్ కుమార్ దర్శకత్వం లో దివంగత స్టార్ హీరో, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కిన "జేమ్స్ "కన్నడ మూవీ మార్చి 17 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో కూడా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రియా ఆనంద్ కథానాయిక . చరణ్ రాజ్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ "జేమ్స్ "మూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించింది.

'సెబాస్టియన్ పీసీ 524' టీజర్ రిలీజ్
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. ఇప్పటికి కిరణ్ సినిమాలు రిలీజ్ అయింది రెండు సినిమాలు మాత్రమే కానీ వరుస అవకాశాలు.. పెద్ద పెద్ద బ్యానర్స్ లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఇక కిరణ్ లిస్ట్ లోచాలా సినిమాలు ఉండగా అందులో సెబాస్టియన్ పీసీ 524 సినిమా కూడా ఒకటి. కిరణ్ అబ్బవరం మొదటిసారి ఈ సినిమాలో పోలీస్ గా నటిస్తున్నాడు. ఈసినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్న నేపథ్యంలో ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు మేకర్స్.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ రిలీజ్
టాలీవుడ్ లో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇక అందులో టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ది డిఫరెంట్ స్టైల్. అందమైన ప్రేమకథలను తెరపై అంతే అందంగా చూపించడంతో ఇంద్రగంటిది డిఫరెంట్ స్టైల్. అష్టాచమ్మా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఇంద్రగంటి ఎన్నో ప్రేమకథలను చూపించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా వస్తుంది. ఇప్పటికే సుధీర్ బాబుతో కలిసి సమ్మోహనం, వి సినిమాలను తెరకెక్కించారు ఇంద్రగంటి. ఆ రెండు సినిమాలు మంచి హిట్ అవ్వడంతో ఈసినిమాపై కూడా అంచనాలు పెరిగాయి.