సైకో, నెగెటివ్ రోల్స్ చేయాలని ఉంది

I Would Love To Play Negative Shade And Psycho Roles Says Allari Naresh,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Allari Nareshnew Movie,Allari Nareshmovies,Allari Naresh Upcoming Movie,Allari Naresh Latest Movie,Allari Naresh Movie Updates,Allari Naresh Latest Movie News,Allari Naresh New Movie Update,Allari Naresh Latest Movie Update,Allari Naresh Talks About Character He Likes Most To Play,Allari Naresh Show Intrest In Playing Negative Shade And Psycho Roles,Negative Shade And Psycho Roles Are More Intresting Character Which Allari Naresh Likes, Allari Naresh Intresting Character Negative Shade And Psycho Roles

ఈమధ్య హీరోలు రొటీన్ పాత్రలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపించంలేదు. సాధ్యమైనంత వరకూ విభిన్నమైన సినిమాలు చేయడానికే ముందుకొస్తున్నారు. అందుకోసం అవసరమైతే విలన్ పాత్రలు ఇంకా నెగెటివ్ షేడ్ పాత్రలు వేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఇప్పుడు హీరో అల్లరి నరేష్ కూడా అలాంటి పాత్రల్లో చేయాలని ఉంది చెబుతున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలతోనే ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చేశాడు. అయితే మధ్య మధ్యలో అల్లరి నరేష్ కూడా పలు ఇంట్రెస్టింగ్ రోల్స్ లో నటించారు. ప్రాణం, నేను, శంభో శివ శంభో ఇంకా గమ్యం సినిమాల్లో నరేష్ డిఫరెంట్ పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు అయితే దాదాపు డిఫరెంట్ గా ఉండే కథలను మాత్రమే ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఆయన నుండి వస్తున్న సినిమా ఉగ్రం. ఈసినిమా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోపక్క చిత్రయూనిట్ ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేసింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరుగుతున్న నరేష్ తనకు కూడా సైకో ఇంకా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించాలని ఉందని తెలిపాడు. అంతేకాదు ఉగ్రం సినిమాలో లుక్ ను చూసి తన కూతురు భయపడిందని కూడా తెలిపారు. చూద్దాం మరి నరేష్ కోరిక మేరకు ఫ్యూచర్ అలాంటి పాత్రలు ఏమైనా వస్తాయేమో..

ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మాట‌లు అబ్బూరి ర‌వి అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, సిద్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.