వారితో ఎన్టీఆర్ నా పేరు- బ్యూటిఫుల్ ఫీలింగ్

Ram Charan About His Name In Critics Choice Super Awards Nominees List,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan New Movie Update,Ram Charan Latest News,Ram Charan About His Name In Critics Choice,Super Awards Nominees,Ram Charan Reacts To Critics Choice Super Awards Nomination,Critics Choice Awards 23,RRR Actors Ram Charan,RRR,RRR Movie,RRR Telugu Move,RRR Movie Updates,RRR Oscar,RRR Oscar 2023,Oscar 2023,RRR Awards,Ram Charan Latest News,Ram Charan Latest Movie Updates,RRR Ram Charan Award

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో తెలియంది కాదు. అయితే ఆర్ఆర్ఆర్ తో మాత్రం ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. అందుకే ఆర్ఆర్ఆర్ సినిమా ఖాతాలో ఎన్నో అంతర్జాతీయ అవార్డులు సైతం చేరాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే పలు అవార్డులను దక్కించుకన్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజాగా తాజాగా క్రిటిక్‌ అసోసియేషన్‌ అవార్డులను సైతం దక్కించుకుంది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. రాజమౌళి, కీరవాణి, రామ్‌చరణ్‌ ఈ అవార్డులను అందుకున్నారు. ఇక ఈనేపథ్యంలో రామ్ చరణ్ తన ట్విట్టర్ లో యాక్షన్ మూవీ కేటగిరీలో బెస్ట్ యాక్టర్ నామినేషన్స్ లిస్ట్ లో టామ్ క్రూజ్, బ్రాడ్ ఫిట్ ఇంకా నికోలస్ కేజ్ లాంటి వారితో పాటు ఎన్టీఆర్ ఇంకా నాపేరు కూడా ఉండటం బ్యూటిఫుల్ ఫీలింగ్ అంటూ తన సంతోషాన్ని మరోసారి వ్యక్తపరిచాడు.

ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 2 =