మెగాస్టార్ చిరంజీవి ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ధారణ చేసి శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేవారని చాలామందికి తెలిసిన విషయమే. ఇప్పుడు కాకపోయినా కొన్నేళ్ళ కింది వరకూ రెగ్యులర్‌గా చిరు మాల వేసుకునేవాళ్ళు. వరస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కూడా చిరు అయ్యప్పమాల ధారణ చేసిన సందర్భాలున్నాయి. తండ్రి చిరంజీవి మాదిరే రామ్ చరణ్ కూడా ప్రతీ ఏటా అయ్యప్ప మాల ధరిస్తున్నారు. ప్రతీసారి నవంబర్‌లో మాల ధారణ చేసే రామ్ చరణ్.. ఈ సారి మాత్రం శంకర్ సినిమా కోసం కాస్త ముందుగానే మాల వేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు నిర్వహించిన అయ్యప్ప మహా పడి పూజలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి తలసాని యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ అయ్యప్ప మాల వేసుకొని ఈ మహా పడిపూజ నిర్వహించారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, తలసాని కుటుంబ సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























