పుష్ప సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇన్నేళ్లు స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ఈసినిమాతో ఐకాన్ స్టార్ గా మారాడు. ఇక సుకుమార్- బన్నీ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 సినిమాలు వచ్చి హిట్ అయ్యాయి. ఆ తరవాత మూడో సినిమాకు దాదాపు 12 ఏళ్లు తీసుకున్నారు. దానికి కారణం హ్యాట్రిక్ సినిమా మాములుగా ఉండకూడదని.. సాలిడ్ స్క్రిప్ట్ తో రావాలని వెయిట్ చేశారు. ఇక అనుకున్నట్టే పుష్ప లాంటి సినిమాతో వచ్చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సుకుమార్ దర్శకత్వంలో గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా కోసం ఇంతవరకూ స్టైలిష్ లుక్కులతో అలరించిన బన్నీ పూర్తిగా తన లుక్ ను మార్చేసి ప్రయోగాత్మకంగా వచ్చాడు. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు,తగ్గేదేలే అంటూ బన్నీ మేనరిజం, తన నటన, సుకుమార్ కథ, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇలా అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈసినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో కూడా తెలుసు. అలానే అవార్డులు కూడా చాలా సొంతం చేసుకుంది. ఇప్పటికే సైమా, ఫిలిం ఫేర్ అవార్డులను పుష్ప తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు మరో సెన్సేషనల్ అవార్డును సొంతం చేసుకున్నాడు బన్నీ. ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను గెలుచుకున్నారు. సీఎన్ఎన్ న్యూస్ 18 నిర్వహించిన ఎంటర్ టైన్మెంట్ జ్యూరీ క్యాటగిరి లో ఈ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు. కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఈ అవార్డు ను అందుకున్నాడు బన్నీ.
ఇక ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించగా అనసూయ, సునీల్, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్లో సందడి చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈసినిమాను నిర్మించారు. ప్రస్తుతం అయితే అందరూ పుష్ప2 కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























