బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతిశెట్టి హ్యాట్రిక్ సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”, “మాచర్ల నియోజకవర్గం”మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా కృతిశెట్టి కోలీవుడ్ లో బంపర్ ఆఫర్ అందుకున్నారు. స్టార్ హీరో సూర్య , దర్శకుడు బాలా కాంబినేషన్ లో తెరకెక్కిన “నందా “,”పితామగన్ “(శివపుత్రుడు ) మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు బాలా దర్శకత్వంలో సూర్య హీరో గా ఒక తమిళ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ లో కృతిశెట్టి ఒక కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ మూవీ తో కృతిశెట్టి కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























