నాగ శేఖర్ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్ మిల్కీ బ్యూటీ తమన్నా హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ సినిమా కన్నడ హిట్ మూవీ ‘లవ్ మాక్‌టైల్’కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను నేడు రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తమన్నా, సత్యదేవ్ ల జోడీ చూడటానికి ఫ్రెష్ గా కనిపిస్తుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























