మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట ” మూవీ 2022 సంవత్సరం జనవరి 13 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. సుబ్బరాజు , వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ నోటీస్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మహేష్ బాబు స్టైలిష్ న్యూ లుక్ లో ఉన్న ఆ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుని 24 గంటలలో 95.6 K లైక్స్ , 49.1 రీ ట్వీట్స్ తో టాలీవుడ్ లో న్యూ రికార్డ్ ను క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Namrata Ma’am, Sir padukune mundhu prathiroju dhisti theeyadam marchipokandi 😀🙏🏻 @urstrulyMahesh @ParasuramPetla @MythriOfficial @GMBents #SarkaruVaariPaata #HBDSuperstarMaheshBabu pic.twitter.com/3pGubMttfs
— Keerthy Suresh (@KeerthyOfficial) August 9, 2021
మహేష్ బర్త్ డే కానుకగా అదిరే బ్లాస్టర్ ను మేకర్స్ నిన్ననే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ టీజర్ లో హీరో మహేష్ బాబు హ్యాండ్ సమ్ గా కనపడ్డారు. టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. 24 గంటల్లో ఏకంగా 23.05 మిలియన్ వ్యూస్ రాబట్టినట్టు సమాచారం.“సర్కారు వారి పాట ” మూవీహీరోయిన్ కీర్తి సోషల్ మీడియా లో తామిద్దరి ఫొటోను షేర్ చేసి ఒక ఫన్నీ వ్యాఖ్యను జోడించారు . నమ్రత మేడమ్ గారు.. సర్ పడుకునే ముందు ప్రతిరోజు దిష్టి తీయడం మర్చిపోకండి..“ అంటూ సూచించి నమ్రత ను ఆట పట్టించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































