ఇప్పటికే రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం రమేష్ వర్మతో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది. ఇక ఈసినిమా చేస్తూనే శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నాడు. దివ్యాంశ కౌశిక్,రజీష విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తోన్నఈసినిమాకు శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను త్వరలోనే పూర్తిచేసి రిలీజ్ చేయడానికిి ప్లాన్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈహీరో మరో యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు వెంకీ కుడుముల. ఛలో, భీష్మ సినిమాలతో డైరెక్టర్ గా వెంకీ కుడుముల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవలే ఈ యంగ్ డైరెక్టర్ రవితేజ కు ఒక సాలిడ్ కథను వినిపించగా అది నచ్చిన రవితేజ వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఖిలాడి సినిమా ఎలాగూ పూర్తవుతుంది కాబట్టి ఆతరువాత వెంటనే ఈసినిమాను పట్టాలెక్కిస్తారేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: