‘నిన్ను కోరి’ సినిమా తర్వాత న్యాచురల్ స్టార్ నాని.. టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘టక్ జగదీష్’. ఈ సినిమా మొదలుపెట్టినప్పటినుండే అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్.. మోషన్ పోస్టర్.. ముఖ్యంగా టీజర్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకూ కూల్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయిన నాని ఈసినిమాతో ఫుల్ యాక్షన్ లోకి దిగనున్నట్టు అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరోవైపు ప్రమోషన్స్ కూడా చిన్నగా మొదలుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. గుమ్మడి వరలక్ష్మి పాత్రలో కనిపించనుంది. ఇక నేడు రీతూవర్మ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. నుదిటిపై తిలకంతో రీతూ ఎమోషనల్ గా నాని వైపు చూస్తున్న ఫొటో షేర్ చేశారు.
𝘓𝘢𝘢𝘭 𝘚𝘢𝘭𝘢𝘢𝘮 @riturv .. oops🤭🤭 we meant A very Happy Birthday 🤩. #HBDKRituVarma #TuckJagadishOnApr23rd@NameisNani @aishu_dil @IamJagguBhai @ShivaNirvana @MusicThaman @sahugarapati7 @harish_peddi @Shine_Screens pic.twitter.com/h88X3M3x6z
— Shine Screens (@Shine_Screens) March 10, 2021
కాగా ఐశ్వర్యా రాజేష్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాలో జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి,తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటో గ్రఫీ ప్రసాద్ మూరెళ్ల అందిస్తున్నాడు. ఏప్రిల్ 23న ఈ సినిమా రిలీజ్ కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























