“ఇష్టం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన శ్రియ “సంతోషం “మూవీ తో విజయం సాధించారు. దక్షిణాది భాషల తోపాటు హిందీ భాషలో కూడా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు స్టార్ హీరోలు , తమిళ స్టార్ హీరోల మూవీస్ లో నటించి శ్రియ ప్రేక్షకులను అలరించారు. శ్రియ ప్రధాన పాత్రలో రూపొందిన “గమనం “మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. “రౌద్రం రణం రుధిరం “, “సండ క్కారి “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




రెండు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న శ్రియ మాట్లాడుతూ.. నవతరం హీరోలతో నటించకూడదనే పట్టింపులు ఏవీ లేవనీ , కథ తో పాటు ఆ మూవీ తన కెరీర్ కు ఎంతవరకూ ఉపయోగపడుతుందో నని ఆలోచిస్తాననీ , స్టార్ ననే భావన తో కాకుండా నటిగా ఆలోచిస్తూ మూవీస్ ఎంపిక చేసుకుంటున్నాననీ, స్టార్ ఇమేజ్ ను ఎప్పుడూ కోరుకోలేదనీ , ఇమేజ్ , అంచనాలవల్ల మనసుకు నచ్చిన కథలు
వదులుకోవాల్సి వస్తుందనీ , తెలుగు ప్రేక్షకులు తనను ఆదరించి స్టార్ ను చేశారనీ , అది తన అదృష్టం గా భావిస్తున్నాననీ చెప్పారు. శ్రియ ఇప్పుడు ప్రయోగాత్మక చిత్రాలపై ఫోకస్ పెడుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























