హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా నిశ్శబ్దం. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 2వ తేదీన అమెజాన్ లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. సస్పెన్స్ ఎలిమెంట్స్.. అనుష్క్ నటన.. మాధవన్ నెగిటివ్ షేడ్.. కాప్ గా అంజలి.. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఇక ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవన్ తన పాత్రపై మాట్లాడారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మాధవన్ మాట్లాడుతూ.. హేమంత్ మధుకర్ నాకు చాలా కాలం నుండి తెలుసు.. నాకు మంచి స్నేహితుడు కూడా… తను కథ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది.. ఈ సినిమా వల్ల కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా నా పాత్రకు వచ్చిన ప్రశంసలు చాలా సంతోషాన్ని కలిగించాయ`ని చెప్పారు. ఇంకా ఓటీటీల గురించి మాట్లాడుతూ.. `గతంలో `బ్రీత్`, ఇప్పుడు `నిశ్శబ్దం` వంటి వాటిల్లో వైవిధ్యమైన పాత్రలు చేసే అవకాశం నాకు దక్కింది. కొత్తగా ఏమైనా చేయాలనుకునే వారికి ఓటీటీ బెస్ట్ ఛాయిస్.. ముందు ముందు మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయాలనుకుంటున్నాను… అమెజాన్ తో కలిసి కొన్ని ప్రాజెక్టులు చేయబోతున్నాన`ని చెప్పారు.
కాగా టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు,తమిళ, మలయాళ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేసారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































