తెలుగు , తమిళ భాషల మూవీస్ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ , సూర్య నమస్కారాలు , గార్డెనింగ్ వంటి వాటితో సమంత అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. “రంగస్థలం “, “ఓ బేబీ ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో అలరించిన సమంత “ది ఫ్యామిలీ మెన్ 2” వెబ్ సిరీస్ లో నటించారు. ఒక తమిళ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



ప్రజలు ఆరోగ్యకర జీవనశైలి అంశాలను ఎంచుకుని , సంపూర్ణ ఆరోగ్యకరంగా జీవించడానికి మెగా కోడలు ఉపాసన హెల్త్ వెబ్ పోర్టల్ యువర్ లైఫ్ ను ప్రారంభించి , సమంత ను అతిథి సంపాదకురాలి గా నియమించారు. ఆర్గానిక్ ఫుడ్ , వర్కౌట్స్ వంటి వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకునే సమంత ఆ పోస్ట్ కు అర్హురాలే. ఇప్పుడు సమంత బ్లాక్ స్పోర్ట్స్ డ్రెస్ తో తాజా వర్కౌట్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. జిమ్ లో సమంత హెవీ వెయిట్ లిఫ్టింగ్ తోపాటు 10KG పౌండ్స్ డంబెల్ తో వర్క్ అవుట్ చేశారు. సమంత వర్కౌట్ ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























