సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఫుల్ కామెడీ చేసిన సినిమాలు అంటే వేళ్ళ మీద లెక్కేసి చెప్పొచ్చు. కామెడీ చేసినా ఒకే ఒక పంచ్ డైలాగ్ తో కామెడీ చేయడం మహేష్ కు అలవాటు. అలాంటి మహేష్ కెరీర్ లో దూకుడు సినిమా మాత్రం తనలోని కామెడీ యాంగిల్ ను బయటకు తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. డైరెక్టర్ శ్రీను వైట్ల మహేష్ ను కొత్త యాంగిల్ లో చూపించడమే కాదు.. మహేష్ కామెడీ చేస్తే ఈ రేంజ్ లో ఉంటుందా అని అభిమానులకు … సినీ ప్రేక్షకులకు చూపించాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీను వైట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , సమంత జంటగా రూపొందిన కామెడీ , యాక్షన్ ఎంటర్ టైనర్ “దూకుడు ” మూవీ 2011 సంవత్సరం 23న రిలీజ్ అయి సంచలన విజయం దక్కించుకుంది. అప్పటివరకు ఉన్న టాలీవుడ్ సినిమా రికార్డ్ లన్ని ఈ సినిమా తిరగరాసింది. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్ లో మహేష్ చెప్పిన డైలాగులు అభిమానులతో పాటు అందర్నీ ఆకట్టుకున్నాయి. అదిరిపోయే యాక్షన్ తో పాటు తనదైన మార్క్ కామెడీ తో దర్శకుడు శ్రీనువైట్ల ఆకట్టుకున్నారు
ఇక ఈ సినిమా నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా డైరెక్టర్ శ్రీను వైట్ల తన ట్విట్టర్ లో అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.దూకుడు సెట్స్ లో ప్రతీ నిమిషమూ ఎంజయ్ చేశా.. నా కెరీర్ లో ఒక మైలురాయి లాంటి క్రేజీ మరియు ఎమోషనల్ సినిమాను ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని శ్రీను వైట్ల ట్వీట్ లో పేర్కొన్నారు.
Dookudu was made enjoying and loving every minute on and off sets.A milestone in my career and I thank @urstrulymahesh for this crazy, emotional and affectionate journey. I thank the cast and crew for this fond memory . #DookuduTrendDay #9YearsForIndustryHitDookudu pic.twitter.com/1o7Cfpp7dn
— Sreenu Vaitla (@SreenuVaitla) September 23, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































