వ‌క్కంతం వంశీ డైరెక్షన్ లో రవితేజ సినిమా

Vakkantham Vamsi To Direct Mass Maharaja Ravi Teja,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Vakkantham Vamsi,Mass Maharaja Ravi Teja,Ravi Teja Latest News,Ravi Teja New Movie News,Ravi Teja Next Project Updates,Ravi Teja Latest Film Updates,Ravi Teja New Movie With Vakkantham Vamsi

వరుసగా ఓ రెండు ప్లాప్స్ వస్తే చాలు ఆ హీరోకు సినిమాలు రావడం చాలా కష్టం. కానీ మాస్ మహా రాజా రవితేజ హిట్, ప్లాప్ తో పనిలేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే డిస్కో రాజా సినిమాతో అలరించిన రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మే 8వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా చేస్తూనే మరో రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే `రాక్ష‌సుడు` ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ర‌వితేజ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. మార్చి నుండి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ సినిమాకి `కిలాడి` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే ఈ టైటిల్ పై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాను రవితేజ లైన్ లో పెట్టినట్టు సమాచారం. వ‌క్కంతం వంశీ డైరెక్షన్ లో రవితేజ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. టాలీవుడ్ టాప్ రైట‌ర్స్‌లో ఒక‌రైన వ‌క్కంతం వంశీ, ద‌ర్శ‌కుడిగా మారి తొలి య‌త్నంగా ‘నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు ఆయ‌న ర‌వితేజ కోసం ఒక స్క్రిప్ట్ సిద్ధం చేశారట. వంశీ వినిపించిన స్క్రిప్ట్ బాగా న‌చ్చ‌డంతో రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.