మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ ఆరంభంలో పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. వాటిలో `కొత్త పేట రౌడీ`, `చండీ ప్రియ` ప్రత్యేకం. ఎందుకంటే… అప్పటి ఇద్దరు స్టార్ హీరోలు నటించిన ఈ రెండు సినిమాలూ ఒకే రోజున జనం ముందు నిలిచాయి. `కొత్త పేట రౌడీ`లో సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించగా.. నటభూషణ్ శోభన్ బాబు హీరోగా `చండీప్రియ` రూపొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే… ఈ రెండు సినిమాల్లో అలనాటి అందాల తార జయప్రద నాయికగా నటించింది. పి. సాంబశివరావు దర్శకత్వంలో రూపొందిన `కొత్త పేట రౌడీ`కి కేవీ మహదేవన్ సంగీతమందించగా.. వి. మధుసూధనరావు దర్శకత్వంలో తెరకెక్కిన `చండీప్రియ`కి పి. ఆదినారాయణ రావు బాణీలు సమకూర్చారు. 1980 మార్చి 7న విడుదలైన ఈ రెండు చిత్రాలు.. నేటితో 40 వసంతాలను పూర్తిచేసుకుంటున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























