ఈ వేసవి దగ్గుబాటి అభిమానులకు వెరీ స్పెషల్ కానుంది. ఎందుకంటే.. దగ్గుబాటి బాబాయ్ వెంకటేష్, అబ్బాయ్ రానా.. తమ కొత్త చిత్రాలతో సందడి చేయనున్నారు. `నారప్ప`గా వెంకటేష్ సమ్మర్ లో సందడి చేయనుండగా.. `విరాట పర్వం`తో రానా అదే సీజన్ లో పలకరించనున్నాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు చిత్రాలకు నాలుగు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఆ వివరాల్లోకి వెళితే.. `నారప్ప`, `విరాట పర్వం` రెండు కూడా పిరియాడికల్ టచ్ తో రూపొందుతున్నాయి. `నారప్ప` 80ల కాలం నాటి వాతావరణంతో తెరకెక్కుతుంటే, `విరాట పర్వం` 90ల నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ రూపొందుతోంది. ఇక ఈ రెండు చిత్రాల్లోనూ ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తుండడం మరో కామన్ ఫ్యాక్టర్. అలాగే రెండు చిత్రాలనూ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భాగస్వామ్యంలో నిర్మిస్తుండడం మూడో కామన్ ఫ్యాక్టర్. ఇక రెండు సినిమాలు కూడా వేసవి కానుకగా మే నెలలోనే రిలీజ్ కాబోతుండడం నాలుగో కామన్ ఫ్యాక్టర్. మరి.. నాలుగు కామన్ ఫ్యాక్టర్స్ తో వస్తున్న ఈ బాబాయ్ – అబ్బాయ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























