ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు ఢీ కొనడం కొత్త కాదు. సుదీర్ఘ సినీ చరిత్రలో ఇలాంటి “స్టార్ క్రాష్” చాలాసార్లు జరిగింది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో భారీ తారల భారీ చిత్రాలు ఓకే డేట్ న రిలీజ్ అవ్వడం
పోటాపోటీగా తలపడటంలో మంచి కాంపిటీటివ్ స్పిరిట్ కనిపించేది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కానీ రాను రాను పరిస్థితులు మారిపోయాయి. ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత పెద్ద హిట్ టాక్ వచ్చినా తొలి మూడు వారాల్లోనే సినిమా జాతకం తేలిపోవడంతో ఓపెనింగ్ డే కలెక్షన్సే సినిమాకు శ్రీరామరక్ష అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే రోజు రెండు సినిమాలు రిలీజయితే రెండింటికీ మధ్య ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో భారీ తేడా వస్తుంది. కాబట్టి రెండింటి రిలీజ్ మధ్య కనీసం ఒక్కరోజు గ్యాప్ ఉండటం అవసరం. కానీ ఈ సంక్రాంతి బరిలో రెండు భారీ చిత్రాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో ఒకే రోజు విడుదలకు సర్వ సన్నద్ధమవ టం చిత్ర పరిశ్రమలో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తుంది.
నిజానికి గతంలో కొన్ని చిత్రాల విషయంలో ఇలాంటి క్లాష్ రిలీజ్ లు అనివార్యమైనప్పుడు అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్, దిల్ రాజు వంటి ప్రముఖులు చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు ప్రముఖుల చిత్రాలే ఇలా క్లాష్ అవ్వటంతో ఎవరికి ఎవరూ ఏమీ చెప్పలేని పరిస్థితి ఎదురయింది.
మొదటి నుండే ఈ క్లాష్ రిలీజ్ విషయంలో అప్రమత్తంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. ఇప్పుడు ఇద్దరూ జనవరి 11న రిలీజ్ కు సిద్ధం అవ్వటంతో సర్దుబాటుకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు అభిమానులు కూడా ఈ పరిస్థితి పట్ల ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎవరు డేట్ మార్చుకున్నా అదేదో ప్రెస్టేజ్ ఇష్యూ అన్నట్లుగా అభిమానులు పంతాలకు పోతున్నారు. నిజానికి ఇది ఎవరినీ ఆక్షేపించలేని అనూహ్య పరిస్థితి.
ఇలాంటి పరిస్థితుల్లో సహన , సంయమనాలతో పరిస్థితిని చర్చల ద్వారా చక్కదిద్దే అవకాశం ఇంకా ఉంది కాబట్టి ఒక మధ్యేమార్గం లభించే అవకాశం ఉందంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. ఈ రెండు సినిమాలతో పాటు జనవరి 10 న విడుదల కానున్న దర్బార్, 13న విడుదల కానున్న ఎంత మంచి వాడవురా చిత్రాలకు కూడా దిల్ రాజే పంపిణీదారుడు కావటంతో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించగలదని ఆశిద్దాం. మరికొన్ని గంటల్లోనే ఈ వివాదానికి తెరపడుతుందన్న ఆశాభావాన్ని ఫిల్మ్ నగర్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























