ఒక్కో దర్శకుడికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. అలా… `మనం` దర్శకుడు విక్రమ్ కుమార్‌కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది. అదేమిటంటే… తన చిత్రాల్లో కథానాయికల పాత్రలకు `ప్రియ` అనే స్క్రీన్ నేమ్ పెట్టడం. `13 బి`తో మొదలుకుని తాజా చిత్రం `గ్యాంగ్ లీడర్` వరకు జయాపజయాలతో సంబంధం లేకుండా ఆ పేరుని ఎంతో `ప్రియం`గా కొనసాగిస్తున్నాడు విక్రమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విక్రమ్ గత చిత్రాలు `13 బి`లో నీతూ చంద్ర, `ఇష్క్`లో నిత్య మీనన్, `మనం`లో సమంత, `24`లో నిత్య మీనన్, `హలో`లో కళ్యాణి ప్రియదర్శన్ స్క్రీన్ నేమ్స్ `ప్రియ` కాగా… కొత్త చిత్రం `గ్యాంగ్ లీడర్`లోనూ కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ పాత్ర పేరు ప్రియ కావడం విశేషం. మరి… తన కథానాయికల పాత్రలకు ప్రియ అనే స్క్రీన్ నేమ్ పెట్టడం వెనుక విక్రమ్కున్న ప్రత్యేక కారణం ఏంటో ఆయనకే తెలియాలి.
[youtube_video videoid=bCITH3-eaRs]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























