8 రోజుల్లోనే 1000 కోట్ల మార్క్ క్రాస్ చేసిన రామాయణం పార్ట్ 1

Ramayana Part 1 Joins the 1000 Crore Club

భారతీయ చలనచిత్ర చరిత్రలో మరో అరుదైన మైలురాయి నమోదైంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘రామాయణం పార్ట్ 1′ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. విడుదలై కేవలం 8 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. ఈ ఘనత సాధించిన భారతదేశంలోని అతికొద్ది (11వ) సినిమాల జాబితాలో ఇది చేరడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విడుదలైన మొదటి రోజు నుంచి అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న పాజిటివ్ టాక్, ప్రేక్షకుల నుంచి లభిస్తున్న అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. ముఖ్యంగా వీకెండ్‌తో సంబంధం లేకుండా వర్కింగ్ డేస్‌లో కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు తగ్గలేదు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ పౌరాణిక దృశ్యకావ్యాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్ల క్యూ కడుతున్నారు.

బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయి వసూళ్లను సాధించడం సినిమా స్థాయిని, ప్రేక్షకుల్లో దానికి ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపించింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రానికి వస్తున్న ఆదరణ చూస్తుంటే కలెక్షన్ల సునామీ మరింతకాలం కొనసాగేలా ఉంది.ఫుల్ రన్ లో 1500కోట్ల మార్క్ చేరుకునేలా వుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.