రేపే థియేటర్లలోకి ఇట్లు అర్జున… పీక్స్‌కు చేరిన బజ్

Itllu Arjuna Arrives in Theatres Tomorrow Amid Huge Buzz

వినూత్న కథాంశం, భారీ ప్రమోషన్లతో ‘ఇట్లు అర్జున’చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. తొలి సినిమాతోనే అనీష్ మాటలు లేని ఒక మూగ యువకుడిగా నటించిన ఈ సినిమాపై విడుదల ముందే ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకుల్లో బలమైన బజ్ నెలకొంది. ఇటీవల సెన్సార్ బోర్డు నుండి ‘యు/ఎ’ సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రం, ప్రైవేట్ స్క్రీనింగ్స్ చూసిన సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమాకు ఇంతటి హైప్ రావడానికి టాలీవుడ్ అగ్ర తారల మద్దతు ప్రధాన కారణంగా నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడమే కాకుండా, చిత్రాన్ని చూసి అనీష్ నటనను అభినందిస్తూ ప్రత్యేక వీడియో బైట్ విడుదల చేయడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. మరోవైపు గ్రాండ్ మ్యూజికల్ కన్సర్ట్ వేడుకకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కింగ్ నాగార్జున, అఖిల్ అక్కినేని విచ్చేసి చిత్రబృందానికి అండగా నిలిచారు.

వీటికి తోడు ఎస్. తమన్ అందించిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలవడం, వెంకీ కుడుముల ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్మాణ విలువలు మరియు అనీష్ – అనస్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా మారాయి.బలమైన ప్రమోషనల్ కంటెంట్ మరియు పాజిటివ్ వైబ్స్‌తో వస్తున్న ‘ఇట్లు అర్జున’ రేపు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.