హిలేరియస్‌గా డీఎన్‌కే ట్రైలర్

DNK Trailer Promises Hilarious Entertainment

బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు మరో ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ ‘DNK’తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. శ్రీను కంబాల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు మంచి స్పందన వచ్చింది. నవంబర్ 13న సినిమా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన హీరో, ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా అప్పులు చేయడంతో పాటు తన గర్ల్‌ఫ్రెండ్ దగ్గర కూడా డబ్బులు తీసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు. ఈ క్రమంలో డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ గర్ల్‌ఫ్రెండ్ తండ్రి అతడి ఇంటికి వచ్చి గట్టిగా హెచ్చరిస్తుంది. అప్పులు పెరిగిపోవడం, వాటిని తీర్చే మార్గం కనిపించకపోవడంతో హీరో తన స్నేహితుడితో కలిసి ధనవంతుల ఇళ్లలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు వరుస దొంగతనాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, వీటి వెనుక బీహార్‌కు చెందిన ముఠా ఉందని అనుమానిస్తారు.

‘లిటిల్ హార్ట్స్’ సినిమాలో తన ఎనర్జిటిక్ నటనతో గుర్తింపు తెచ్చుకున్న మౌళి తనూజ్ ప్రశాంత్ ఈ సినిమాలో తన పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. ప్రతి సన్నివేశంలోనూ తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. అతడి గర్ల్‌ఫ్రెండ్‌గా సుష్మిత శెట్టి అందంగా, అమాయకంగా కనిపించారు. హీరో తల్లిదండ్రులుగా అలీ, రాజిత తమ కామెడీతో మరింత వినోదాన్ని అందించారు. బబ్లూ, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్, నంద గోపాల్ కీలక పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.

ప్రస్తుత యువతకు బాగా కనెక్ట్ అయ్యే కథాంశాన్ని దర్శకుడు శ్రీను కంబాల ఎంచుకున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్న యువత పరిస్థితులను ఈ సినిమాలో చూపించారు. కామెడీ, రొమాన్స్, దొంగతనాల నేపథ్యంలో కథను నడిపిస్తూనే ఒక మంచి సామాజిక సందేశాన్ని కూడా అందించే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. భిన్నమైన అంశాలను దర్శకుడు కలిపిన విధానం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ సినిమాకు స్టైలిష్ విజువల్ అప్పీల్ తీసుకొచ్చింది. సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి వినోదభరితమైన సన్నివేశాలతో పాటు దొంగతనాల సమయంలో వచ్చే ఉత్కంఠను కూడా తన సంగీతంతో చక్కగా చూపించారు. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, నాగేంద్ర గువ్వల ప్రొడక్షన్ డిజైన్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 

జెన్ జెడ్ యువతతో పాటు ఫ్యామిలీకి కూడా కనెక్ట్ అయ్యే కథాంశంతో వస్తున్న ‘DNK’ మంచి థియేట్రికల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.