అదిరిపోయే ఆల్బమ్‌తో వస్తున్న దేత్తడి

Dethadi Set to Deliver a Stunning Album

యువ హీరో ఆశిష్, ప్రముఖ దర్శకుడు ఆదిత్య రావు గంగసాని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ అండ్ ఎనర్జిటిక్ చిత్రం ‘దేత్తడి’ . టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ ఆడియో అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ ‘ఆదిత్య మ్యూజిక్’ దక్కించుకుంది. సిటీ సంస్కృతి, తీన్‌మార్ డ్రమ్స్‌ను హైలైట్ చేస్తూ యూత్‌ను ఊపేసే ఊరమాస్ సాంగ్స్, సెలబ్రేషన్ బంగర్స్‌తో కూడిన హై-వోల్టేజ్ ఆల్బమ్‌ను త్వరలోనే శ్రోతల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

హైదరాబాదీ మాస్ స్వాగ్, డ్రమ్ ఆర్ట్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఆశిష్ గన్ను భాయ్ అనే పవర్‌ఫుల్ అండ్ ఎనర్జిటిక్ రోల్‌లో కనిపిస్తున్నారు. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తుండగా, సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచగా, త్వరలోనే రాబోతున్న ఆడియో ట్రాక్స్ చార్ట్‌బస్టర్లుగా నిలిచి మ్యూజిక్ ప్లేలిస్ట్‌లను షేక్ చేయబోతున్నాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.