ఉలగనాయగన్ కమల్ హాసన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘భారతీయుడు 3’ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. అవినీతిపై పోరాడే పవర్‌ఫుల్ సేనాపతి పాత్ర మళ్లీ ‘జీరో టాలరెన్స్’ వైఖరితో పూర్తి యుద్ధ రంగానికి సిద్ధమయ్యాడు. మేకర్స్ ఈ రోజు సినిమాకు సంబంధించిన ‘వార్ మోడ్’ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సిద్ధార్థ్, కాజల్ అగర్వాల్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, ఎస్‌జే సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, రవివర్మన్ ఛాయాగ్రహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
విజువల్ ఆకట్టుకునేలా శంకర్ మార్క్ యాక్షన్ అండ్ ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ -ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో త్వరలోనే విడుదలకానుంది. నిజానికి ఈసినిమాను ముందు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు.మరి ఈసినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























