ఆంధ్రప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

Bharat Bhushan Announces Key Details on AP Nandi Awards

ఆంధ్రప్రదేశ్ నంది అవార్డులకు సంబంధించిన కీలక ప్రకటనను ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి చైర్మన్ భారత భూషణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారు నేడు ప్రకటించడం జరిగింది. గత కొద్ది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగిపోయిన నంది అవార్డుల కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విషయాలను మీడియా వేదికగా ప్రకటించారు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా *ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భారత భూషణ్ గారు* మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎంతో కాలం నుండి తెలుగు సినీ, టీవీ, నాటక రంగాలు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ఇన్ని సంవత్సరాల నంది అవార్డులు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అలాగే నందమూరి బాలకృష్ణ గారి ప్రత్యేక చొరవతో నంది అవార్డులు అందచేయనున్నారు. గతంలో ప్రకటించినట్లు 2012 నుండి 2016 వరకు ప్రకటించిన అవార్డులకు బహుమతి ప్రధానం ఉంటుంది. 2017 నుండి 2024 వరకు ఒక్కొక సంవత్సరానికి 4 అవార్డు లెక్కన అందచేయడం ఉంటుంది. 2025 అవార్డులు తాజాగా చూసి అందచేయనున్నారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఎన్టీఆర్ అవార్డులు, రివార్డులు కూడా డిసెంబర్ 25 నాటికి ఇవ్వనున్నారు. టివి, నాటక రంగానికి కూడా ఇదే తరహాలో ఇవ్వనున్నారు. ఈరోజు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అన్ని రంగాలకు విడుదల చేసి అక్టోబర్ 12 నాటికి అన్ని అప్లికేషన్స్ వచ్చాక అక్టోబర్ 2వ వారంలో జ్యూరీ, కమిటీ వెల్లడిస్తాము. గత 3 నెలలుగా దీనికి సంబంధించిన వర్క్ చేస్తూ వచ్చాము. ఈ సమయంలో తెలుగు సినిమాలకు ప్రాముఖ్యత ఇస్తున్నాము. సింగిల్ విండో విధానం కూడా రానున్న 20 నుండి 30 రోజులలో అనౌన్స్ చేస్తాము” అన్నారు. 

*ఏపీ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారు* మాట్లాడుతూ… “దీనికి సంబంధించి అవార్డుల లెక్కలు ఉన్నాయి. ప్రతి అవార్డు సంబంధించిన వివరాలు వివరంగా తగిన వెబ్సైట్లో ఉంటాయి. 2012 నుండి 2016 వరకు అవార్డ్స్ ప్రకటించినప్పటికీ ఆ అవార్డులను అందజేయలేదు. ఫిలింలో సుమారు 288 అవార్డులు, 51 జ్యూరీ అవార్డులు అలాగే టీవీ రంగంలో 330 అవార్డులు, 54 జ్యూరీ అవార్డులు ఉన్నాయి. పాత అవార్డులు ఇచ్చి, 2017-2024 అవార్డులు ప్రకటించలేదు. కాబట్టి ఒకొక సంవత్సరానికి 4 అవార్డులను ఇవ్వనున్నాము. ఫస్ట్ బెస్ట్, సెకండ్ బెస్ట్ అలాగే రెండు జ్యూరీ అవార్డులను ఇవ్వనున్నాను. ఆ తర్వాత సంవత్సరం నుండి పూర్తిస్థాయిలో అవార్డులను అందజేస్తాము. 2011 తర్వాత నంది అవార్డులను ఇప్పుడే ప్రారంభిస్తున్నాను. ఎంతో ప్రెస్టేజ్ గల ఈవెంట్ తెలుగు ప్రజలకు మర్చిపోవాలని ఒక అనుభవం. ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసేందుకు సిద్ధమైంది. భరత్ భూషణ్ గారు చైర్మన్ గా, తోటి మెంబర్ల సహకారంతో అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు, నందమూరి బాలకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మంచి విజయం సాధించబోతుంది. ఈ కార్యక్రమాన్ని అమరావతి ప్రాంతంలో అలాగే టీవీ అవార్డులను తిరుపతిలో చేయనున్నారు” అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.