మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ భారీ ఆదరణ పొందుతున్న వేళ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ఇరుముడి’ సినిమా సాధిస్తున్న విజయంపై సంతోషం వ్యక్తం చేసిన చరణ్.. రవితేజతో పాటు దర్శకుడు శివ నిర్వాణ, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు ప్రత్యేకంగా అభినందనలు అందజేశారు.
సినిమా కోసం చిత్ర బృందం పడిన కష్టాన్ని, వారి కృషిని కొనియాడుతూ.. రాబోయే రోజుల్లో వారికి మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. అయ్యప్ప మాలధారణ భక్తి నేపథ్యంతో వచ్చిన ఈ సినిమాకి తన ట్వీట్‌ను “స్వామి శరణం” అంటూ పవిత్రమైన ముగింపు ఇవ్వడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న తరుణంలో రామ్ చరణ్ చేసిన ఈ ట్వీట్ ‘ఇరుముడి’ చిత్ర యూనిట్‌కు మరింత ఉత్సాహాన్ని అందించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























