యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ… ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత ‘ఓ.! సుకుమారి’ తో ప్రేక్షకుల ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. జూలై 17న సినిమా విడుదలవుతోంది. ముందుగా మా నిర్మాత మహేశ్వర్ రెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన ఈ కథను ఎంతో నమ్మారు. ఒక చిన్న సినిమాను పెద్ద సినిమాలా తీర్చిదిద్దడానికి ప్రతి ప్రయత్నం చేశారు. ఈ సినిమా ఆయనకు చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అందరం కలిసి సక్సెస్ పార్టీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దర్శన్‌కు ఆల్ ది బెస్ట్. తిరువీర్ గారితో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమాటోగ్రాఫర్ ఎంతో అందంగా చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ భరత్ అద్భుతమైన సంగీతం అందించారు. పాటలన్నీ చాలా బాగా వచ్చాయి. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక కారులో ప్రయాణిస్తుండగా ఈ సినిమా పాటలు వరుసగా దాదాపు పది సార్లు వినిపించాయి. ప్రతి పాట అద్భుతంగా ఉంది. భరత్‌కు చాలా మంచి భవిష్యత్తు ఉంది.మా సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























