వెనక్కి వెళ్ళిపోయిన మా ఇంటి బంగారం

Release of Maa Inti Bangaram Pushed Back

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదల వాయిదా పడింది. ఈ సినిమా విడుదలపై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదట ఈ సినిమాను మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ సీజన్ కారణంగా ప్రేక్షకుల రాకపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించి, విడుదలను వాయిదా వేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు జూన్ 19, 2026న థియేటర్లలోకి రానుంది.

‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ తర్వాత సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆమె ఒక శక్తివంతమైన గృహిణి పాత్రలో కనిపిస్తుండగా, యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘తస్సదియ్య’ పాట మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, శ్రీముఖి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.