చార్మింగ్ స్టార్ శర్వా లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రిమియర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకులు, విమర్శకులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బంపర్ బ్లాక్ బస్టర్ మీట్ ని నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చార్మింగ్ స్టార్ శర్వా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ముందుగా ప్రభాస్ అన్నకి థాంక్స్ చెప్పాలి. మా ట్రైలర్ రిలీజ్ కి ట్వీట్ వేశారు. అలాగే సినిమా రిలీజ్‌కు ముందు ఒక చిన్న యాడ్ చేసి సపోర్ట్ ఇచ్చారు. లవ్ యూ ప్రభాస్ అన్న. నా మనసులో ఆయన ఎప్పుడూ గొప్ప స్థానంలో ఉంటారు. ఈ సినిమాకు ఫస్ట్ హీరో మా ప్రొడ్యూసర్ వంశీ అన్న. ఈ కథను మొదట నాకు పంపించింది ఆయనే. యూవీ క్రియేషన్స్‌లో ఇది నాకు నాలుగో హిట్. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు, ఇప్పుడు బైకర్. సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ ఇస్తానని చెప్పాను.. ఇచ్చాను. ఇప్పుడు సమ్మర్‌కు బంపర్ బ్లాక్‌బస్టర్ ఇచ్చాం. ఈ విజయాన్ని నాకు అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఇలాంటి సినిమాలు చేయాలంటే ప్రొడ్యూసర్‌కు అభిరుచి ఉండాలి. ఈ సినిమాను అద్భుతంగా నిర్మించిన వంశీ అన్నకి థాంక్యూ. మా డైరెక్టర్ అభిలాష్ రెడ్డి గారు చెప్పిన కథ నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది. నేను ఇలా ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వడానికి, వెయిట్ తగ్గుడానికి కారణం నన్ను ఇన్‌స్పైర్ చేసిన కథ. ఈ క్యారెక్టర్ కోసం దాదాపు 22 కిలోలు తగ్గాను. “బైకర్” ద్వారా నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఇండియా గర్వించే సినిమా తీస్తామని చెప్పాం..తీసాం. ఇప్పుడు ఆడియన్స్‌కు చూపిస్తున్నాం. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఇది నా బెస్ట్ ఫిల్మ్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. రేసింగ్ సీక్వెన్స్‌లు అద్భుతంగా రావడానికి కారణం యాక్షన్ మాస్టర్ దిలీప్. అలాంటి సీన్స్ చేయాలంటే విజన్, అనుభవం చాలా అవసరం. మా డీఓపీ యువరాజ్, మధి గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ ఇంకా నా చెవుల్లో మార్మోగుతోంది. మాళవిక స్క్రీన్ ప్రెజెన్స్ చాలా చక్కగా ఉంది. ఎడిటర్ అనిల్ సినిమా అద్భుతంగా ఎడిట్ చేశారు.
డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి థాంక్యూ. సంపత్ గారితో “భోగి” సినిమా చేస్తున్నాను .. దానికి కూడా నేను చాలా కష్టపడాలి. షూటింగ్ సమయంలో నేను, మాళవిక ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం కాదు. ఏదైనా ఉంటే డైరెక్టర్ ద్వారానే చెప్పుకునేవాళ్లం. ఇప్పుడు ప్రమోషన్స్‌లో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మాళవిక బెస్ట్ పెర్ఫార్మర్. రాజశేఖర్ గారి దగ్గర నుంచి హంబుల్‌నెస్ నేర్చుకోవాలి. ఆయనంత సింపుల్, ప్యూర్ హార్టెడ్ వ్యక్తిని నేను చూడలేదు. ఆయన లెజెండరీ యాక్టర్. ఆయన మా సినిమాలో భాగమవడం గర్వంగా ఉంది. స్క్రీన్ మీద నిజంగా తండ్రి-కొడుకుల్లా అనిపించింది. ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. “బైకర్”ని యూత్ చూస్తున్నారు.ఇందులో స్పోర్ట్స్ డ్రామాతో పాటు తండ్రి-కొడుకుల ఎమోషన్ ఉంది. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ నన్ను ఎప్పుడూ బిలీవ్ చేస్తారు. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. మీరు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. ఇది చాలా జెన్యూన్ ఫిల్మ్. మీరు చూస్తే మంచి సినిమా చేశానని అభినందిస్టారు. ఇంత పెద్ద బంపర్ బ్లాక్‌బస్టర్ ఇచ్చినందుకు ఆడియన్స్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























