అక్కినేని నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఈ సినిమాకు సంబంధించిన మోస్ట్ అవేటెడ్ గ్లింప్స్ నేడు విడుదలైయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పవర్ఫుల్ గ్లింప్స్‌ను మధ్యాహ్నం 12:12 గంటలకు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. 2 నిమిషాల 6 సెకన్ల నిడివితో వచ్చిన ఈ గ్లింప్స్ ఆశ్ఛర్యపరిచింది.ముఖ్యంగా విజువల్స్ అదిరిపోయాయి. విఎఫ్ఎక్స్ వర్క్ చాలా క్వాలిటీ గా వుంది. విలన్ తో పరిచయమైన ఈ గ్లిమ్ప్స్ ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. నాగ చైతన్య స్టయిలిష్ లుక్ లో అదరగొట్టాడు. ఓవరాల్ గా ఈ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇందులో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. మలయాళ స్టార్ నటుడు జయరామ్ ‘ప్రొఫెసర్ రంగనాథ్’ అనే కీలక పాత్రలో కనిపిస్తుండగా, ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. సుమారు రూ. 120 కోట్ల భారీ బడ్జెట్‌తో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో వస్తున్న ఈ సినిమాకు స్వయంగా దర్శకుడు సుకుమార్ కథను అందించడం విశేషం.
‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. అడ్వెంచర్ మరియు ఆధ్యాత్మిక అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం చైతు కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.ఎస్వీసీసీ ఈసినిమాను నిర్మిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































