పెద్ది సెకండ్ సింగిల్ అదిరిపోయింది

Peddi’s Second Song Strikes the Right Chord

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ చిత్రం నుండి మోస్ట్ అవేటెడ్ సెకండ్ సింగిల్ “రై రై రారా”నేడు విడుదలై సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాట పూర్తిగా మోటివేషనల్ సాంగ్ గా సాగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొదటి పాట ‘చికిరి చికిరి’ క్లాస్ అండ్ మెలోడీగా ఉంటే, ఈ పాట మాత్రం థియేటర్లలో ఈలలు వేయించే రేంజ్‌లో ఉంది. హెవీ బీట్స్ మరియు పవర్‌ఫుల్ బాణీలతో పాట ఆద్యంతం ఉత్సాహంగా సాగింది.

రామ్ చరణ్ తన గ్రేస్ మరియు ఎనర్జీతో మరోసారి మ్యాజిక్ చేశారు. ఇందులో చరణ్ వేసిన స్టెప్పులు, ముఖ్యంగా ఆ ‘సిగ్నేచర్ మూమెంట్స్’ అభిమానులకు కన్నుల పండుగగా ఉన్నాయి.ఈ స్టెప్స్ చరణ్ మొదటి సినిమా చిరుత ను గుర్తు చేశాయి.’నాటు నాటు’ తర్వాత చరణ్ పెద్ది లో తన డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఈ పాటను డిజైన్ చేశారు.

అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం హీరో క్యారెక్టరైజేషన్‌ను చాలా స్ట్రాంగ్‌గా ఎలివేట్ చేసింది. ఓవరాల్ ఈ సెకండ్ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అనిపించుకోవడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.ఏప్రిల్ 30న పెద్ది థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.