రాకాస టీజర్ రిలీజ్

Rakasa Teaser Released

యువ నటుడు ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త హారర్ ఫాంటసీ కామెడీ చిత్రం ‘రాకాస’ టీజర్ నిన్న ఘనంగా విడుదలైంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“నరకం నుంచి సందేశం వస్తుంది”, “మన ఊరి శాపం ఇది” వంటి ఇంటెన్స్ డైలాగులతో టీజర్ ప్రారంభమై ఆకట్టుకుంటోంది. అమెరికా నుండి వచ్చిన ఒక యువకుడు తన సొంత ఊరిలోని పాత బంగ్లాలో చిక్కుకోవడం, అక్కడ అతనికి ఎదురయ్యే వింత అనుభవాలను కామెడీ మరియు హారర్ మేళవింపుతో ఇందులో చూపించారు.

సంగీత్ శోభన్ సరసన ‘ఆయ్’ ఫేమ్ నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మానస శర్మ ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతుండగా, అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.ఈ వినూత్న ఫాంటసీ డ్రామాను వేసవి కానుకగా ఏప్రిల్ 3, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలచేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.