గత ఏడాది కె ర్యాంప్ తో విజయాన్ని అందుకుని సూపర్ ఫామ్ లో వున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. డియర్ కామ్రేడ్ ఫేమ్ భరత్ కమ్మ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్మిస్తుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుంతున్న ఈ సిరీస్ కి గువ్వల చెరువు ఘాట్ అనే టైటిల్ ప్రచారం లో వుంది. ఇందులో నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కిరణ్ అబ్బవరం ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. చెన్నై బ్యాక్ డ్రాప్ లో బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంది. ఇందులో మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇది కాకుండా సూపర్ హిట్ క సీక్వెల్ క 2 కూడా లైన్లో పెట్టాడు కిరణ్. త్వరలోనే ఈసినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



































