వెడ్డింగ్ ఆఫ్ విరోష్ : ప్రకటించిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Makes Big Announcement on Wedding of Virosh

ప్రముఖ సినీ తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహం గురించి వస్తున్న వార్తలపై అధికారికంగా స్పందించారు. అభిమానులు తమ ఇద్దరి పేర్లను కలిపి ఎంతో ప్రేమతో ‘విరోష్’ అని పిలుచుకుంటున్నారని, ఆ నిర్ణయాన్ని గౌరవిస్తూ తమ పెళ్లి వేడుకకు ‘వెడ్డింగ్‌ ఆఫ్‌ విరోష్‌’ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వారు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమ పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాలతో వెండితెరపై అలరించిన ఈ జంట, ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వివాహం చేసుకోనున్నారు. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో ఘనంగా వివాహ విందు వేడుకను నిర్వహించనున్నారు. తమ జీవితంలోని ఈ ముఖ్యమైన ఘట్టంలో అభిమానులను కూడా భాగస్వాములను చేస్తూ వారు ఈ పోస్ట్ పంచుకున్నారు.

ఇక ఈ జంట, పెళ్లి వేడుక కోసం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా వారు విమానాశ్రయానికి చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.