మృత్యుంజయ్ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది

Mrithyunjay Gets a New Release Date

శ్రీవిష్ణు నటించిన రెండు సినిమాలు ‘మృత్యుంజయ్’ మరియు ‘విష్ణు విన్యాసం’ ఒకే సమయంలో (ఫిబ్రవరి 27, 28) విడుదల కావాల్సి ఉండటంతో టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. అయితే, ఒకే హీరో నటించిన రెండు సినిమాలు ఇలా వరుసగా రావడం వల్ల ఓపెనింగ్స్ మరియు ప్రమోషన్స్ పై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ‘మృత్యుంజయ్’ విడుదలను వాయిదా వేశారు.ఇక ఈరోజు కొత్త డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం మార్చి 6 ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కిన ఈసినిమాలో శ్రీవిష్ణు సరసన ‘సామజవరగమన’ ఫేమ్ రెబా మోనికా జాన్ కథానాయికగా నటించింది. ఆమె ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుండగా, శ్రీవిష్ణు ఇన్వెస్టిగేటర్ మరియు ఖైదీగా రెండు విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.

‘నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాలకు కథా సహకారం అందించిన హుస్సేన్ షా కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.కాల భైరవ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఈ సినిమాకు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.