నేచురల్ నాని , దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ . ‘దసరా’ వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ మళ్లీ జతకడుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా కోసం ఒక భారీ సెట్‌ను నిర్మించారు.ప్రస్తుతం ఈ సెట్‌లో ఏకంగా 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నీట మునిగిన ఇళ్ల మధ్య ఒక ఉత్కంఠభరితమైన పోరాట సన్నివేశాన్ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేశారు. దీని కోసం ఏకంగా కృత్రిమ వరదను సృష్టించి, అత్యంత వ్యయప్రయాసలతో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేస్తున్నారు.
శ్రీకాంత్ ఓదెల తన సినిమాల్లో రా అండ్ రస్టిక్ విజువల్స్ చూపించడంలో సిద్ధహస్తుడు.1960 కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామాలో నాని లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉండబోతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో కాయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా మోహన్ బాబు ,రాఘవ్ జ్యూయెల్, సంపూర్ణేష్ బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు.ఈసినిమాను మార్చి 26న విడుదలచేయాలని చూస్తున్నారు.అయితే ఇప్పుడు ఆ డేట్ కి రావడం అనుమానమే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























