బాస్ ఈజ్ బ్యాక్ – అల్లు అర్జున్

Allu Arjun Praises the Mana Shankara Vara Prasad Garu Team

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ కేవలం 8 రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరి ప్రభంజనం సృష్టిస్తోంది.ఇక తాజాగా ఈసినిమాను వీక్షించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఈ సినిమా కేవలం బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదని, ఇది సంక్రాంతి ‘బాస్’ బస్టర్ అని ఆయన కితాబిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాస్ ఈజ్ బ్యాక్: మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ వైబ్స్‌తో వెండితెరపై చూడటం చాలా ఆనందంగా ఉందని, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వెలిగిపోయిందని ప్రశంసించారు.

వెంకీగౌడ మ్యాజిక్: ఈ సినిమాలో కర్ణాటక వ్యాపారవేత్త ‘వెంకీగౌడ’గా నటించిన విక్టరీ వెంకటేష్ నటనను బన్నీ కన్నడలో ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. “ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಾ” (చాలా బాగా చేశారు) అంటూ ఆయన పోస్ట్ చేయడం విశేషం.

తారాగణం: నయనతార గ్రేషియస్ ప్రెజెన్స్, కేథరిన్ త్రెసా పంచిన హ్యూమర్, సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌ను అభినందించారు. ముఖ్యంగా ‘సంక్రాంతి స్టార్’ బుల్లిరాజు (రేవంత్) పాత్ర – “కొరికేత్తాను.. కొరికేత్తాను.అని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

టెక్నికల్ టీమ్: హుక్‌స్టెప్, మెగా విక్టరీ వంటి విజిల్స్ వేయించే సాంగ్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియోకు, నిర్మాతలకు (సుస్మిత కొణిదెల, సాహు గారపాటి) అభినందనలు తెలిపారు.

హిట్ మెషీన్ అనిల్ రావిపూడి: దర్శకుడు అనిల్ రావిపూడిని ‘సంక్రాంతి బ్లాక్ బస్టర్ మెషీన్’ అని అభివర్ణిస్తూ.. “సంక్రాంతికి వస్తారు.. హిట్ కొడతారు.. రిపీట్..” అంటూ ఆయన సక్సెస్ ట్రాక్ రికార్డును కొనియాడారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.