కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం మల్టీ ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. తన 47వ చిత్రం కోసం ‘ఆవేశం’ ఫేమ్ మలయాళ ఫిల్మ్ మేకర్ .జీతూ మాధవన్ తో కలిసి పనిచేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న అనౌన్స్మెంట్స్ లో ఒకటిగా నిలిచింది. అభిమానులు,ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తుండగా విజయవంతమైన చిత్రాలతో అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ నస్లెన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిన్న సూర్య47 చెన్నైలో సాంప్రదాయ పూజా కార్యక్రమంతో అధికారికంగా లాంచ్ అయింది.ఈ కార్యక్రమంలో చిత్ర తారాగణం, సిబ్బంది , పరిశ్రమ నుండి అనేక మంది శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.ఈ వేడుకకు చిత్ర నిర్మాత శ్రీమతి జ్యోతిక, నటుడు కార్తీ, రాజశేఖర్ పాండియన్ (2D ఎంటర్‌టైన్‌మెంట్), నిర్మాతలు S.R. ప్రకాష్, S.R. ప్రభు (డ్రీమ్ వారియర్ పిక్చర్స్) అతిథులుగా హాజరయ్యారు.పూజ తర్వాత, చిత్రీకరణను ప్రారంభించారు.అధికారికంగా మొదటి షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైయింది.
ఈ సందర్భంగా దర్శకుడు .జీతూ మాధవన్ మాట్లాడుతూ. కొత్త పరిశ్రమ, కొత్త ప్రారంభం, అది కూడా సూర్య లాంటి స్టార్‌తో.. ఇది మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. మేము కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నాము.మేము అందించాలనుకుంటున్నఫ్రెష్ నెస్ ని ప్రేక్షకులు అంగీకరించి ఆనందిస్తారని ఆశిస్తున్నాము.”
జాన్ విజయ్, ఆనంద్ రాజ్ తోపాటు మరికొంత మంది ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.ఈసినిమాకి సుషిన్ శ్యామ్ సంగీతం,వినీత్ ఉన్ని పలోడే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు .త్వరలోనే మేకర్స్ నుంచి మరిన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్లు రానున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























