సంబరాల ఏటిగట్టు నుంచి ‘అసుర ఆగమన’ గ్లింప్స్‌ వస్తోంది

Asura Aagamana Glimpse Coming Soon From Supreme Hero Sai Durgha Tej’s SYG

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ (SYG). దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, చిత్ర యూనిట్ ఒక సాలిడ్ అప్‌డేట్‌ను అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అసుర ఆగమన’కు రంగం సిద్ధం

ఈ సినిమాలోని కొత్త గ్లింప్స్‌కు ‘అసుర ఆగమన’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ గ్లింప్స్‌ను అక్టోబర్ 15న హీరో సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారు. అయితే, దీనిని వినూత్నంగా ఆవిష్కరించనున్నారు. దీనిలో భాగంగా, చిత్ర యూనిట్ ఈ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి ఒక గ్రాండ్ ప్లాన్ చేసింది. ఒక భారీ తెరపై ఈ గ్లింప్స్‌ లాంచ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

  • తేదీ & సమయం: అక్టోబర్ 15వ తేదీ, ఉదయం 10 గంటలకు.
  • వేదిక: హైదరాబాద్‌లోని ఫేమస్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లోని పీసీఎక్స్ (PCX) భారీ తెరపై ఈ ‘అసుర ఆగమన’ గ్లింప్స్‌ను లాంచ్ చేయనున్నారు.

ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. “గాలిలో గుసగుసలాట… ఆత్మలో ఒక తుఫాన్… ‘అసుర ఆగమన’ గ్లింప్స్‌ను ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి” అని అందులో వారు ట్వీట్ చేశారు.

ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచే రగ్డ్‌ టోన్, డార్క్ విజువల్స్‌ తో ప్రేక్షకుల్లో మంచి కురియాసిటీ క్రియేట్‌ చేసింది. ఇప్పుడు ‘అసుర ఆగమనం’ గ్లింప్స్‌ ద్వారా సాయి ధరమ్ తేజ్ మరో కొత్త యాంగిల్‌లో కనిపించబోతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. పవర్‌ఫుల్‌ బ్యాక్‌డ్రాప్‌, మిస్టరీ ఎలిమెంట్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఈ గ్లింప్స్‌ పండగలా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

మెగా అభిమానులకు బర్త్‌డే ట్రీట్‌గా వస్తున్న ఈ పవర్-ప్యాక్డ్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఏ స్థాయికి పెంచుతుందో చూడాలి. దీంతో, ఫ్యాన్స్ దీనికోసం ఇప్పటినుంచే ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రోహిత్‌ KP దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డిలు భిన్నమైన కాన్సెప్ట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ నుంచే రగ్డ్‌ టోన్, డార్క్ విజువల్స్‌ తో ప్రేక్షకుల్లో మంచి కురియాసిటీ క్రియేట్‌ చేసింది.

‘అసుర ఆగమనం’ గ్లింప్స్‌ ద్వారా సాయి ధరమ్ తేజ్ మరో కొత్త యాంగిల్‌లో కనిపించబోతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. పవర్‌ఫుల్‌ బ్యాక్‌డ్రాప్‌, మిస్టరీ ఎలిమెంట్స్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ఈ గ్లింప్స్‌ పండగలా ఉండబోతోంది. ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో “#SYG #AsuraAagamana” హ్యాష్‌ట్యాగ్స్‌తో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.