కాంతారతో పాన్ ఇండియా బ్లాక్బస్టర్ అందుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి మోస్ట్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసి అంచనాలను భారీగా పెంచింది. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఈవెంట్ లో హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మీ అందరి ప్రేమకు సపోర్టుకి ధన్యవాదాలు. ఈ వేడుక వచ్చిన అందరికీ థాంక్యూ సో మచ్. ఎన్టీఆర్ గారు నాకు ఫ్రెండు, బ్రదర్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక బ్రదర్ తో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ వేడుక హైదరాబాదులో జరుపుకోవడం, దానికి ఎన్టీఆర్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ఆడియన్స్ కి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకి వచ్చిన ఎన్టీఆర్ గారికి థాంక్యూ సో మచ్. ఈ సినిమాకి మీరందరూ సపోర్ట్ చేసి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అక్టోబర్ 2న ఈ సినిమాని అందరూ థియేటర్స్ లో చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























