ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ కంప్లీట్ కాగా త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇక ఈసినిమా లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం అఫీషియల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మదరాసి ప్రమోషన్స్ లో భాగంగా ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ … రుక్మిణిని మదరాసి కోసం తీసుకునేటప్పుడు అప్ కమింగ్ హీరోయిన్.ఇప్పుడు కాంతార చాప్టర్ 1 అలాగే ఎన్టీఆర్ నీల్, టాక్సిక్ సినిమాలను చేస్తుందని అన్నారు. సో ఎన్టీఆర్ నీల్ మూవీ లో హీరోయిన్ గా రుక్మిణి కన్ ఫర్మ్. మేకర్స్ కూడా ఈవిషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ , మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమా వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ కానుంది. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
ఇక ఇదిలావుంటే రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన మదరాసి ఈనెల 5న విడుదలకానుంది. శివ కార్తికేయన్ ఇందులో హీరోగా నటించగా ఏఆర్ మురగదాస్ డైరెక్ట్ చేశాడు. తమిళంలో రుక్మిణి కి ఇదే రెండో సినిమా. మరి ఈసినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























