గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓజీ. ఈసినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో వున్నాయి. ఇందులో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించిన విషయం తెలిసిందే.ఇక ఈసినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించనుంది అయితే సెకండ్ హీరోయిన్ గా కాకుండా స్పెషల్ సాంగ్ లో మెరవనుంది.ఇంతకీ తను ఎవరంటే కన్నడ బ్యూటీ ,డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి.ఓజీ లో స్పెషల్ సాంగ్ చేసానని ఈవిషయాన్ని స్వయంగా తనే ఓ ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో శ్రీయా రెడ్డి ,అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటించగా ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.తమన్ సంగీతం అందిస్తుండగా డివివి దానయ్య ఈసినిమాను నిర్మిస్తున్నాడు.సెప్టెంబర్ 25న ఓజీ పాన్ ఇండియా భాషల్లో థియేటర్లలోకి రానుంది.హిట్ టాక్ వస్తే ఓజీ కలెక్షన్ల వర్షం కురిపించనుంది.సోలోగా రిలీజ్ కానుండడం ఓజీకి మరింత అడ్వాంటేజ్ కానుంది.
ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసే పనిలో వున్నాడు.తన పాత్రకు సంబంధించి ఇంకో వారం షూటింగ్ పెండింగ్ వుంది.హరీష్ శంకర్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా రాశి ఖన్నా ,శ్రీ లీల హీరోయిన్లు గా నటిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈసినిమా రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























