‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాల ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు నేడు ఆయన తన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగాతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమ హోం బ్యానర్ భద్రకాళి ప్రొడక్షన్స్ తరపున ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కును వారు ముఖ్యమంత్రికి అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సమావేశం సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న మంచి సంబంధాలను సూచిస్తుంది. సినీ ప్రముఖులు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడటం, సామాజిక బాధ్యతను తీసుకోవడం మంచి పరిణామం అని చెప్పవచ్చు. కాగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ఆయన తన వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ ఈ విరాళాన్ని అందజేశారు. ఇది ఆయన ఉదారతకు, సామాజిక స్పృహకు నిదర్శనమని సినీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే సందీప్ వంగా విరాళం గురించి తెలుసుకున్న నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఇదిలావుంటే, సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో ప్రభాస్ జోడీగా ‘యానిమల్’ ఫేమ్ తృప్తి డిమ్రి కథానాయికగా నటించనున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ ఇంతకుముందెన్నడూ కనిపించని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండటం సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. మరి కొన్ని రోజుల్లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























