మెగా 158 అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

Megastar Chiranjeevi’s 158th Film Poster Out Now

మన వరప్రసాద్ గారు తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించనున్న158వ సినిమా బాబీ డైరెక్షన్ లో రానుంది.ఈరోజు చిరు బర్త్ డే సందర్భంగా సినిమాను అఫీషియల్ ప్రకటించారు.ఈ సందర్భంగా మేకర్స్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.ఇక ఈపోస్టర్ చూస్తుంటే తెలుస్తుంది.ఈసినిమా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో బ్లడ్ బాత్ మూవీగా రానుందని.ఇందులో బాబీ,చిరుని సరికొత్త అవతారంలో చూపించనున్నాడు.తమన్ సంగీతం అందించే అవకాశాలు వున్నాయి.త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.ఈసినిమాతో కన్నడ బిగ్ ప్రొడక్షన్ హౌస్ కెవిఎన్ ప్రొడక్షన్స్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఈసంస్థ కన్నడలో యష్ హీరోగా టాక్సిక్ అలాగే తమిళంలో దళపతి విజయ్ హీరోగా జన నాయగన్ సినిమాలు నిర్మిస్తుంది.ఇక ఇప్పుడు తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

https://twitter.com/KvnProductions/status/1958858909084745956

ఇక చిరంజీవి ప్రస్తుతం మన వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు.అనిల్ రావిపూడి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా  నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. సగం షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.నవంబర్ లో సినిమా అంతా కంప్లీట్ కానుంది.షైన్ స్క్రీన్స్ ,గోల్డ్ బాక్స్ ఎంటెర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి.వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.ఆ తరువాత మెగా 158 సెట్స్ మీదకు వెళ్లనుంది.

 ఇక ఈసినిమాలతో పాటు దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో కూడా సినిమాకు కమిట్ అయ్యారు చిరు.నేచురల్ స్టార్ నాని ఈసినిమాను నిర్మించనున్నాడు.చిరు కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ మూవీ గా రానుంది.అయితే శ్రీకాంత్ ప్రస్తుతం ది ప్యారడైజ్ తో బిజీగా ఉండడంతో ఈప్రాజెక్ట్ ఆలస్యం కానుంది.దాంతో ఈ గ్యాప్ లో చిరంజీవి, బాబీ తో సినిమా చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.