టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి తన తొలి సినిమాకే జాతీయ పురస్కారం గెలుచుకుని తెలుగు సినిమాకు గౌరవాన్ని తీసుకొచ్చారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలలో ఆమె నటించిన ‘గాంధీ తాత చెట్టు’ చిత్రానికిగాను ఉత్తమ బాల నటిగా ఎంపికయ్యారు. ఈ అసాధారణ విజయాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను ఘనంగా సత్కరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈమేరకు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో సుకృతి వేణిని, ఆమె తండ్రి సుకుమార్ మరియు తల్లి తబితతో పాటు చిత్ర నిర్మాత యలమంచిలి రవిశంకర్ తదితరులను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సినిమాకు సహకరించిన దర్శక-నిర్మాతలను, సాంకేతిక బృందాన్ని కూడా ఆయన అభినందించారు. ఇక ఈ చిత్రం కోసం సుకృతి వేణి గుండు కొట్టించుకుని నటించడం ఆమె అంకితభావానికి నిదర్శనమని సీఎం కొనియాడారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ఒక నటిగా తొలి చిత్రంతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయం. ‘గాంధీ తాత చెట్టు’ సినిమా పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక సందేశాన్ని అందిస్తూ, ప్రేక్షకులను కూడా ఆలోచింపజేసింది. ఇలాంటి మంచి చిత్రాలు తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో అవసరం” అని ప్రశంసించారు.
ఈ వీడియోలో సుకుమార్ కుటుంబంతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైన దృశ్యాలు చూడవచ్చు. కాగా ఈ సత్కార కార్యక్రమం సుకృతికి, చిత్ర బృందానికి మరింత స్ఫూర్తినిచ్చింది. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న యువ ప్రతిభను సీఎం ప్రోత్సహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























