వార్ 2.. ఏపీలో టికెట్ రేట్ల పెంపు, సీఎం చంద్ర‌బాబుకి ఎన్టీఆర్ కృత‌జ్ఞ‌త‌లు

NTR Thanks AP CM Chandrababu and DCM Pawan Kalyan For Supporting War 2

ఇండియన్ మూవీ లవర్స్ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటైన క్రేజీ మల్టీస్టారర్‌ ‘వార్ 2’ విడుదలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. అద్భుతమైన యాక్షన్‌, స్టైల్‌తో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ స్క్రీన్ మీద తుఫాన్ సృష్టించబోతున్నారు. భారీ అంచనాల మధ్య రేపు వేకువఝామునే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జూనియర్ తొలిసారిగా చేసిన స్టైట్ హిందీ చిత్రం కావడం, హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరో ఉండటం, అలాగే యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుండి వస్తోన్న సినిమా కావడంతో.. తారక్ అభిమానులతో పాటుగా మూవీ లవర్స్ అందరూ వార్ 2ని వీక్షించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో దీనిని నిర్మాత సూర్యదేవర నాగవంశీ భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకి బెనిఫిట్ షోలు మరియు టికెట్ రేట్ల పెంపుకి అనుమతినిచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, ఆగస్టు 14 ఉదయం 5 గంటలకు ఒక ప్రత్యేక షో నిర్వహించేందుకు, సింగిల్ స్క్రీన్‌లలో రూ.75, మల్టీప్లెక్స్‌లలో రూ.100 (GST కలిపి) చొప్పున టికెట్ రేట్లు పెంచేందుకు అనుమతి లభించింది. ఈ రేట్లు ఆగస్టు 23 వరకు అమలులో ఉంటాయి.

దీంతో హీరో ఎన్టీఆర్ ఏపీ ప్రభుత్వానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా.. “వార్ 2 విడుదలకు కొత్త G.O. ఆమోదించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని అందులో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.