మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. బ్లాక్ బస్టర్ ‘వార్’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న వార్ 2 రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తారక్ తొలిసారి స్ట్రైట్ హిందీ సినిమాలో నటించడంతో వార్ 2పై తెలుగు రాష్ట్రాలలో కూడా మంచి హైప్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వార్ 2 విడుదలకు ముందు మేకర్స్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి గుడ్ న్యూస్ అందింది.
నిర్మాత నాగవంశీ అభ్యర్థన మేరకు, ఏపీ ప్రభుత్వం మూవీ రిలీజ్ రోజున.. అనగా ఆగస్టు 14వ తేదీ ఉదయం 5 గంటలకు ప్రత్యేక షో వేసుకునే వెసులుబాటును కల్పించింది. అలాగే దీనితోపాటుగా టికెట్ ధరలను పెంచుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, రోజుకు 5 షోలు మించరాదు అనే షరతు విధించింది. కాగా ఈ రేట్లు ఆగస్టు 14 నుంచి 23, 2025 వరకు అమల్లో ఉంటాయి. రోజుకు గరిష్టంగా ఐదు షోలు మాత్రమే వేసుకోవాలి అని షరతు విధించారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..
- ఆగస్టు 14న ప్రత్యేక షో టికెట్ ధర రూ. 500 (GST సహా)గా ఉండనుంది.
అదే విధంగా, ఆగస్టు 14 నుంచి 23 వరకు..
- సింగిల్ స్క్రీన్లలో ఒక్కో టికెట్‌పై ధర రూ. 75 (GST సహా) పెంపు.
- దీంతో సింగిల్ స్క్రీన్లలో టోటల్ టికెట్ రేట్ – రూ.222గా ఉండనుంది.
- మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై రూ. 100 (GST సహా) వరకు పెంపు.
- దీంతో మల్టీప్లెక్స్‌లలో టోటల్ టికెట్ రేట్ – రూ.277గా ఉండనుంది.

ఇక ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు వర్తిస్తాయి. సంబంధిత జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, లైసెన్సింగ్ అథారిటీలు, పోలీస్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా వార్ 2పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉన్న నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ఉత్తర్వులతో ఫస్ట్ డే, ఫస్ట్ షో మరింత గ్రాండ్‌గా జరగనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























