హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల వార్ 2 ఈనెల 14న థియేటర్లలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఉండడం తో ఈసినిమాపై తెలుగులో కూడా భారీ అంచనాలు వున్నాయి.ఇక ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు.దీనికి ఎన్టీఆర్ తోపాటు హృతిక్ ,డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ,త్రివిక్రమ్ ,నాగవంశీ తదితరులు హాజరయ్యారు.నాగవంశీ ఈసినిమాను తెలుగులో విడుదలచేస్తున్నాడు.భారీ ధర పెట్టి ఈ థియేట్రికల్ రైట్స్ ను తీసుకున్నాడు.ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వార్ 2 హిందీ డబ్బింగ్ సినిమాలా ఉండదని,ప్రాపర్ తెలుగు సినిమాలా ఉంటుంది.లిప్ సింక్ సహా ప్రతిదీ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది.అయాన్ ముఖర్జీ గారు ఇప్పటి వరకు తారక్ అన్నను చూపించిన దానికంటే బాగా చూపించారని మీరే గర్వంగా ఫీలవుతారు.మనం హృతిక్ రోషన్ గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి స్వాగతిస్తున్నట్లు సినిమా ఉంటుంది. దేవర మీద చూపించిన ప్రేమకంటే పదింతలు ఎక్కువ ప్రేమ వార్ 2 మీద చూపించాలి. తారక్ అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే సెప్టెంబర్ 27 కంటే పదింతలు ఎక్కువ ప్రేమ చూపించాలి.
హిందీ బాక్సాఫీస్ నెట్ ఎంత ఉంటుందో దాని కంటే ఒక్క రూపాయి నెట్ మనం ఎక్కువ పెట్టాలి.దేవర కంటే పదింతలు ఎక్కువ ఓపెనింగ్ తీసుకు రావాల్సిన బాధ్యత అభిమానులది.మన కోసం అన్న కాలర్ ఎగరేశారు.ఇప్పుడు అన్నయ్య ఇండియాలో కాలర్ ఎగరేసేలా చేయాలి. మీరు ఈ సినిమా చూసి షాక్ అవుతారని నాగవంశీ అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























