సూపర్ స్టార్ రజినీకాంత్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘కూలీ’ విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ క్లిక్ కావడంతో భారీ హైప్‌తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో తమిళ్ సినిమా చరిత్రలో సరికొత్త మైలురాయి నెలకొల్పింది. ఈ చిత్రం, ఉత్తర అమెరికా ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో అద్భుతమైన రికార్డు సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఉత్తర అమెరికాలో ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో 2 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 16.6 కోట్లు)కు పైగా వసూళ్లు అందుకుంది. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి తమిళ చిత్రంగా కూలీ రికార్డు సృష్టించింది. సూపర్ స్టార్ అభిమానులు, నాన్ స్టాప్ టికెట్ బుకింగ్స్‌తో థియేటర్లను హౌస్‌ఫుల్ చేసేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ కాస్ట్‌తో కూడిన ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరో, కింగ్ నాగార్జున కెరీర్‌లో తొలిసారి విలన్‌గా కనిపించనుడటం, దీనికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కీలక పాత్రను పోషిస్తుండటం సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది. అలాగే రజినీకాంత్ సహనటుడు, మరో స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తుండటం మరో విశేషం. ఇంకా కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలీని తన మార్క్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ఫ్యాన్స్‌ను అలరించేందుకు రెడీగా ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























