తారక్ మీకు అన్న కావొచ్చు.. కానీ నాకు మాత్రం తమ్ముడు అని అన్నారు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. ఈ మేరకు ఆయన తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘వార్ 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. వీరిద్దరూ కలిసి నటించిన ఈ మచ్ అవైటెడ్ ఫిల్మ్ ఈనెల 14న విడుదలవుతోంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరో హృతిక్ రోషన్ తొలుత తెలుగులో ‘అందరికీ నమస్కారం. హైదరాబాద్, ఎలా ఉన్నారు?’ అంటూ పలకరించి ఆకట్టుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “తారక్ మీకు అన్న. నాకు తమ్ముడు. మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా. ఎప్పటికీ ఈ బంధం ఇలాగే ఉంటుంది. మనం ఓ ఫ్యామిలీ. ‘క్రిష్’ షూటింగ్ టైమ్‌లో హైదరాబాద్ వచ్చాను. తెలుగు ప్రజలు చూపించే అభిమానం, ఇచ్చే గౌరవం నాకు తెలుసు. చాలా గొప్పగా ఉంటుంది.”
“మరో 4 రోజుల్లో ‘వార్ 2’ రాబోతోంది. ఇందులో కబీర్ పాత్రను ఎంజాయ్ చేస్తూ చేశా. టైగర్ వంటి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. అభిమానుల కోసం ఏదైనా చేస్తాడు. ఏ షాట్ అయినా తను 100% ఎఫర్ట్ పెట్టి చేస్తాడు. అలాగే ఏ పాత్రకైనా పూర్తి న్యాయం చేసే గొప్ప నటుడు. తారక్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. దానిని నా తరువాతి సినిమాల్లో అనుసరిస్తా. వార్ 2 మీ అందరినీ తప్పక అలరిస్తుంది. లవ్ యూ ఆల్” అని తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























